Congress : వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై షర్మిల ఫోకస్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీల మధ్య వలసలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీలో టికెట్ దక్కని ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిపోయారు. By Bhavana 06 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AICC Chief : ఏపీలో ఎన్నికలు(AP Elections) సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార వైసీపీ పై పార్టీలో ఉన్న నేతలు చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే అసంతృప్త ఎమ్మెల్యేల ను కాంగ్రెస్(Congress) పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ లో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చేరిన విషయం తెలిసిందే. ఆయన వెంటే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ కూడా ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలోనే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా కాంగ్రెస్ లోకే దూకారు. వైసీపీ(YCP) అసంతృప్త ఎమ్మెల్యేలను తాము వైపునకు తిప్పుకుంటే.. ఆ ఓట్లను కూడా తమకు పడేలా చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ లో చేరనున్న ఆమంచి కృష్ణమోహన్(Amanchi Krishna Mohan). ఆయన అనుచరులతో ఇప్పటికే మంతనాలు జరిపిన ఆమంచి. కొద్ది రోజుల క్రితమే వైసీపీకి రాజీనామా చేసిన ఆమంచి. ఎన్నికల్లో చీరాల నుంచే కచ్చితంగా పోటీ చేస్తానని ఆమంచి వివరించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా...కాంగ్రెస్‌లో చేరాలా అనే దానిపై అనుచరులతో చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌లో చేరాలని కొందరు, వద్దని మరికొందరి సూచన...కాంగ్రెస్ పెద్దలతో ఆమంచి మంతనాలు జరిపినట్లు సమాచారం. 2014 సెంటిమెంట్‌ని పునరావృతం చేయాలని ఆమంచి వర్గం ఆలోచనలో ఉంది. ఆమంచి పోటీతో చీరాలలో త్రిముఖ పోటీ జరగనుంది. ఆయన బరిలో ఉంటే TDP, YCP ఓట్లు చీలే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. Also read: ఆ నొప్పితో రెండేళ్లు బాధపడ్డా.. ఇక నాకు పెళ్లి అవుతుందో లేదో..నటి సంచలన కామెంట్స్! #amanchi-krishna-mohan #ys-sharmila #congress #ycp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి