Andhra Pradesh : సీఎం జగన్‌కు వివేక భార్య సౌభాగ్య సంచలన లేఖ..
సీఎం జగన్‌కు.. దివగంత నేత వైఎస్ వివేక సతిమణి సౌభాగ్యమ్మ సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో జగన్ తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. వివేక హత్యకు కారణమైన వాళ్లకు జగన్ రక్షణగా ఉంటున్నారంటూ నిలదీశారు.
సీఎం జగన్‌కు.. దివగంత నేత వైఎస్ వివేక సతిమణి సౌభాగ్యమ్మ సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో జగన్ తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. వివేక హత్యకు కారణమైన వాళ్లకు జగన్ రక్షణగా ఉంటున్నారంటూ నిలదీశారు.
AP: కాంగ్రెస్‌పై మోడీ విషం చిమ్ముతున్నారని అన్నారు షర్మిల. మతాల మధ్య మళ్లీ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారని.. మోడీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
AP: సీఎం జగన్‌తో ఆస్తిగొడవలపై షర్మిల తొలిసారి స్పందించారు. ఆస్తిలో వాటా పొందే హక్కు ప్రతి ఆడబిడ్డకూ ఉంటుందని అన్నారు. కొంతమంది వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా.. చెల్లికి కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపించేవారూ ఉన్నారని సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు.
AP: షర్మిలకు ఈసీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య ప్రస్తావన, అవినాష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. 48 గంటల్లోగా ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని షర్మిలకు నోటీసులు జారీ చేసింది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పై దాడి జరగడం బాధకరమన్నారు. జగన్ ఎడమ కంటిపై గాయం కావాటం దురదృష్టకరమన్నారు వైఎస్ షర్మిల.
AP: వైఎస్ వివేకా హత్య కేసులో తన వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు షర్మిల. వివేకాను చంపించింది అవినాష్‌రెడ్డే అని సీబీఐ ఆధారాలతో చెబుతుంటే.. జగన్ తన అధికారం అడ్డుపెట్టి హంతకులను కాపాడుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
వైఎస్ షర్మిల, సునీతలపై వారి మేనత్త, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కుటుంబ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని మండిపడ్డారు. అయితే, కొడుకుకు మేలు చేసినందుకే విమలమ్మ జగన్ ను సపోర్టు చేస్తున్నారని షర్మిల ఫైర్ అయ్యారు.
జగన్, షర్మిల పాలిటిక్స్ మధ్య తల్లి విజయమ్మ నలిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలో తెలియక ఆమె అమెరికా వెళ్లిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. విజయమ్మ అమెరికాకు వెళ్లడంపై ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.