South Africa: మొసలి బారి నుంచి భర్తను కాపాడిన భార్య!
ఒక మొసలి తన దవడలలో ఎవరినైనా పట్టుకుంటే, దాని నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అవుతుంది.కాని ఓ మహిళ మొసలినే చంపేసింది..
ఒక మొసలి తన దవడలలో ఎవరినైనా పట్టుకుంటే, దాని నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అవుతుంది.కాని ఓ మహిళ మొసలినే చంపేసింది..
స్టార్ క్రికెటర్ చాహెల్ భార్య తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ట్రోలర్ల పై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది.మీ తల్లి, సోదరి కూడా మహిళలే అని గుర్తు పెట్టుకోండి... అందుకే స్త్రీలను గౌరవించండి అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
భార్య భర్తల మధ్య గొడవల వల్ల విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. భార్యకు భర్త భరణం చెల్లించాలని కోర్టులు తీర్పులు ఇస్తుంటాయి. కానీ ఓ దంపతుల విడాకుల కేసులో ఇండోర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యే భర్తకు భరణం కింద నెలకు రూ. 5వేలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఓ వ్యక్తి తన భార్యను 12ఏళ్లు ఇంట్లో బంధించి తాళం వేసిన సంఘటన మైసూర్ లో చోటుచేసుకుంది. మలమూత్ర విసర్జనలు ఓ బాక్స్ లోనే చేసిన ఇల్లాలు.. పిల్లలకు కిటికిలోంచి అన్నం పెట్టింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆమెను రక్షించారు. భర్తపై కేసు పెట్టేందుకు ఆమె నిరాకరించడం విశేషం.
మనుషులు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. అనుమానం వస్తే చాలు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో భార్యకు శిరోముండనం చేసి..చిత్ర హింసలు పెట్టిన సంఘటన ఆందోళన కలిగిస్తోంది.
భర్తకు ఉద్యోగం లేకపోయినప్పటికీ కూడా భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అంటూ అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. దినసరి కూలీగా అయినా రోజుకు కనీసం 600 రూపాయల వరకు సంపాదించవచ్చు కాబట్టి భార్యకు భరణం అందించడం తప్పనసరని కోర్టు తీర్పునిచ్చింది.
తల్లి ఉద్యోగం చేసినా, పిల్లలను పోషించే బాధ్యత మాత్రం తండ్రిదేనని జార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన భర్తపై వరకట్న వేధింపుల ఫిర్యాదు చేసినప్పటి నుంచి పిల్లల పోషణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని నిభా సింగ్ అనే మహిళ ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది.
భర్తలపై తప్పుడు ఆరోపణలు చేసే భార్యలకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. అత్తవారింట్లో ఆహారం పెట్టట్లేదని, టానిక్ పేరిట దోమల మందు తాగించారని ఓ ఇల్లాలు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇంట్లోలేని భర్తలపై నిందలు మోపడం క్రూరత్వ చర్యలుగా పేర్కొంది.
తన ఫోన్ చూసి ఇస్తానని అడిగిన భర్త కండ్లను ఇల్లాలు పొడిచేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. అంకిత్ యూట్యూబ్ చూసి ఇస్తానని అడిగితే ప్రియాంక ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా కత్తెరతో అంకిత్ కండ్లు పోడిచేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.