/rtv/media/media_files/2025/02/07/2EwOOzh7d4mvKI2hNNnu.jpg)
clashes between Abids CI And His Wife
భార్యాభర్తల మధ్య గొడవ రచ్చ కెక్కింది. ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకవడంతో వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళింది. ఇందులో భర్త స్వయంగా పోలీసే కావడం మరో విశేషం. హైదరాబాద్ లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు చెందిన సీఐ కుంభం నరసింహ తన భార్యపై కేసు నమోదు చేశాడు. తన బిడ్డను కిడ్నాప్ చేసిందని...తన నుంచి దూర చేయడానికి ప్రయత్నిస్తోందని సరూర్ నగర్ పీఎస్ లో భార్య మీద కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు నరసింహ భార్య సంధ్య ఊరైన ఊటుకూరుకు చేరుకొని రెండు గంటలుగా ఆమెని విచారించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. సంధ్య బంధువులు, పోలీసులకు మధ్యనా కాసేపు వాగ్వాదం జరిగింది.
పోలీసులు వేధిస్తున్నారు..
విచారణ పేరుతో పోలీసులు తనను వేధిస్తున్నారని సంధ్య చెబుతోంది, పాప తన దగ్గరే ఉందని చెప్పినా, పోలీసులకు చూపించినా కూడా వదలడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తూ పిల్లలను దూరం చేస్తున్నాడని సంధ్య ఆరోపిస్తోంది. భార్యాభర్తలైన తమ మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయని...ఈ వ్యవహారం పై కోర్టులో కేసు నడుస్తుందని సంధ్య చెబుతున్నారు. అయినా కూడా తనపై ఇలా కేసులు పెట్టి హింసించడం అన్యాయం అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భర్త అబిడ్స్ సిఐ కుంభం నరసింహ పై చర్యలు తీసుకోవాలని సంధ్య డిమాండ్ చేస్తున్నారు.
Also Read: AP: ముఖ్యమంత్రి చంద్రబాబు- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ ..