/rtv/media/media_files/2025/02/09/EM5vnl6z0kuV6UxwVwNI.jpg)
bike challans
తన భార్య విడాకులు అడిగిందని ఓ భర్త ఆమెపై రివేంజ్ ప్లాన్ చేశాడు. తన భార్యపై ఉన్న కోపంతో ఆమె పేరుపై ఉన్న బైక్ పై చలాన్లు వచ్చేటట్లు ప్రవర్తించాడు. ఈ విచిత్రమైన సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని కాజీ మొహమ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు గతేడాది పాట్నాకు చెందిన వ్యక్తితో వివాహం చేసుకుంది. వారి పెళ్లి సమయంలో మహిళ తండ్రి వరుడికి ఒక బైక్ ను కట్నం కింద ఇచ్చాడు, అయితే దానిని తన కుమార్తె పేరుతో రిజిస్టర్ చేయించాడు.
అయితే పెళ్లి అయిన కొన్ని నెలలకు దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి, దీంతో ఆ మహిళ తన భర్త ఇంటిని వదిలి తన పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రావాలని భర్త కోరిన ఆమె వెళ్లలేదు. గొడవలు మరింతగా పెరగడంతో వ్యవహారం ఏకంగా విడాకుల వరకు వెళ్లింది. దీంతో భార్యపై పగపెంచుకున్న మహిళ భర్త రివేంజ్ ప్లాన్ చేశాడు.
Also Read : Swati Maliwal : పార్టీ ఓడిపోతే సిగ్గులేకుండా డ్యాన్స్ చేస్తావా.. సీఎంపై స్వాతి ఫైర్!
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ
ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆమె బైక్ కు చలాన్లు వచ్చేటట్లు ప్రవర్తించాడు. మొదట్లో వచ్చిన ఛలాన్లకు ఆమె డబ్బులు కడుతూ వచ్చింది. కానీ ఇవి తరచుగా పెరగడంతో చివరికి ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించింది. మూడు నెలల్లో ఏకంగా 40కి పైగా చలాన్లు వచ్చాయని ఇవన్ని తన భర్త కావాలనే చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్తను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. బైక్ తనకు ఇవ్వాలని మహిళ కోరగా అందుకు ఆమె భర్త నిరాకరించాడు. విడాకులు అయ్యే వరకు బైక్ ను తిరిగి ఇవ్వనని చెప్పేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read : Delhi Elections Results : లక్కీ ఛాన్స్.. ఎన్నికలకు ముందు పార్టీ మారి గెలిచారు!