ప్రాణాలకు తెగించిన యువకుడు.. తండ్రి, కూతురిని ఎలా కాపాడాడంటే?
పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. అది గమనించిన సాయిబాబు అనే యువకుడు కాలువలోకి దూకాడు. ఆపై కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న తండ్రి కూతురిని రక్షించాడు. సాయిబాబు సాహసాన్ని స్థానికులు ప్రశంసించారు.