ప్రాణాలకు తెగించిన యువకుడు.. తండ్రి, కూతురిని ఎలా కాపాడాడంటే? పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. అది గమనించిన సాయిబాబు అనే యువకుడు కాలువలోకి దూకాడు. ఆపై కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న తండ్రి కూతురిని రక్షించాడు. సాయిబాబు సాహసాన్ని స్థానికులు ప్రశంసించారు. By Seetha Ram 12 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి ఓ తండ్రీ కూతురు కలిసి కారుల వస్తున్నారు. ఓ ఫ్యాక్టరీ సమీపంలో ఆ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఆపై పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అందులోనే తండ్రీ కూతురు ఇరుక్కుపోయారు. బయటకు రాలేని పరిస్థితి. యువకుడి సాహసం దీంతో ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఓ యువకుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. వెంటనే కాలువలోకి దూకాడు. ఆపై కారు అద్దాలు పగులగొట్టి ఆ తండ్రీకూతురిని కాపాడాడు. అతడి సాహసానికి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇది కూడా చదవండి: అదుపు తప్పిన కారు.. అందులో ఏముందో చూసి షాకైన పోలీసులు! పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లి్ంది. వాహనం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దీంతో ఆ ప్రమాదాన్ని గమనించిన సాయిబాబు అనే యువకుడు వెంటనే కాలువలోకి దిగాడు. ఇది కూడా చదవండి: తెలంగాణకు మళ్లీ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఆపై ఒక రాడ్‌తో కారు అద్దాలను పగలగొట్టాడు. అనంతరం ఆ లోపల చిక్కుకున్న తండ్రీ, అతని కూతురిని రక్షించాడు. స్థానిక అధికారులు యువకుడి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. వాహనం కాలువలోకి పడిపోవడానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తున్నారు. #west-godavari-district #tanuku మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి