బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ప్రమాద హెచ్చరికలు జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీన పడిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు.
Visakhapatnam: నిద్రలో ఉంటే మాత్రం దాన్ని ఎలా మింగావ్ సామీ..!
విశాఖపట్నంలో ఓ వ్యక్తి నిద్రలో పళ్ల సెట్‌ను మింగేశాడు అది ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవడంతో వెంటనే కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స ద్వారా దాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు. ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
వైజాగ్‌లో రెచ్చిపోయిన కామంధులు.. పెళ్లి చేసుకుంటానని లా స్టూడెంట్‌పై..
విశాఖలో లా చదువుతున్న యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వంశీ అనే యువకుడు స్నేహితుడు గదికి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. మానసిక వేధన అనుభవించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. తల్లిదండ్రులు గమనించి అడగడంతో విషయం బయటపడింది.
షాకింగ్ వీడియో.. నడిరోడ్డుపై జుట్టుపట్టుకుని కొట్టుకున్న మహిళలు..
వైజాగ్‌లోని గాజువాక మార్కెట్లో చిరు వ్యాపారులు నడిరోడ్డు పై కొట్టుకున్నారు. మహిళలు సైతం నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకున్నారు. అడ్డుకోబోయిన ఓ యువకుడిని సైతం తీవ్రంగా కొట్టారు. ఒకరు దుకాణం పెట్టుకున్న ప్రాంతంలో మరొకరు వచ్చి చేరడంతో వివాదం మొదలైంది.
Rushikonda: రుషికొండ ఫైల్స్ మిస్సింగ్.. తలలు పట్టుకుంటున్న అధికారులు
రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు ఒక్కొక్కటిగా మాయమవ్వడం కలకలం రేపుతోంది. ప్యాలెస్ నిర్మాణానికి అనుమతి ఫైళ్లు, అలాగే మరికొన్ని ముఖ్యమైన పేపర్లు దొరకడం లేదు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
నాగసాధువులతో కలిసి అఘోరీ పూజలు | Lady Aghori Naga Sadhu Special Pooja for Lord Shiva in Vizag | RTV
ఏపీకి జాక్‌పాట్.. ఆ జిల్లాలో రూ.1.40 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్టు..!
ఉక్కు సంస్థలైన ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ జాయింట్ వెంచర్ అయిన AM/NS ఇండియా ఏపీలో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో రూ.1.4 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.