Dum Biryani : ధమ్ బిర్యానీలో బ్లేడ్.. హాస్పిటల్ పాలైన కస్టమర్!
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో దారుణం జరిగింది. బిర్యానీ తింటుండగా ప్లేట్లో బ్లేడ్ కనిపించింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆపై హాస్పిటల్లో టీటీ చేయించుకున్నాడు.
Visakhapatnam: నిద్రలో ఉంటే మాత్రం దాన్ని ఎలా మింగావ్ సామీ..!
విశాఖపట్నంలో ఓ వ్యక్తి నిద్రలో పళ్ల సెట్‌ను మింగేశాడు అది ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవడంతో వెంటనే కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స ద్వారా దాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు. ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
Dog Milk: కుక్క పాలు తాగుతూ రచ్చ చేసిన యువతి.. వీడియో వైరల్
ఓవర్ నైట్‌లో ఫేమస్ అయ్యేందుకు ఓ యువతి పిచ్చిపని చేసింది. ఏకంగా కుక్క పాలు తాగుతూ రచ్చ చేసింది. పడుకున్న శునకం దగ్గరకు వెళ్లి ఆ యువతి ఈ నీచమైన పని చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
డిసెంబర్ 21న ఆకాశంలో అద్భుతమైన వింత.. అస్సలు మిస్ అవ్వకండి..!
డిసెంబర్ 21న ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. పగలు 8 గంటలు.. రాత్రి 16 గంటల సమయం ఉండనుంది. దీన్ని శీతాకాలపు అయనాంతం (వింటర్ సోల్స్టైస్) అంటారు. శీతాకాలపు అయనాంతం రోజున వివిధ దేశాల్లో ఉత్సవాలు సైతం జరుపుకుంటారు.
చిలుకను పట్టిస్తే రూ.1 లక్ష.. ఆఫర్ అదిరింది గురూ..!
ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్ షహార్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తాను పెంచుకున్న రామ చిలుక కనిపించకుండా పోయిందని.. దాన్ని వెతికి పట్టుకున్నవారికి రూ.లక్ష బహుమతి ఇస్తా అంటూ నవీన్ పాఠక్ అనే వ్యక్తి చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అత్యంత విషపూరితమైన పక్షుల్ని చూశారా?.. పాముల కంటే ప్రమాదం!
భూమ్మీద అత్యంత విషపూరితమైన పక్షులు ఉన్నాయి. హుడెడ్ పిటోహుయ్, ఇఫ్రిట్, యూరోపియన్ క్వాయిల్, రఫ్ గ్రౌస్, రెడ్ వార్బలర్ సహా మరిన్ని పక్షులు విషపూరితమైనవి. వీటిని తాకితే దురద, మంట, తిమ్మిరి వంటి చర్మపు చికాకును అనుభవిస్తారు. ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది.
Success Stories: సాఫ్ట్వేర్ జాబ్ వదిలి.. ఏటా రూ.90 లక్షల సంపాదన..!
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ జంట ఐటీ ఉద్యోగాలు వదిలి, ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో గుంటూరులో 'శ్రేష్ఠే' ఆర్గానిక్ ఫార్మింగ్ వ్యాపారం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ జంట ఏటా రూ.90 లక్షల వ్యాపారం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్!
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు నాటుకోడి చికెన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్న విందులో నాటుకోడి చికెన్ వడ్డించడంతో ఈ వివాదం మొదలైంది. అయితే ఆ చికెన్ తాను తినలేదని ఆయన తెలిపారు.