Vijayashanti: ఎందుకంత పైశాచిక ఆనందం.. అలా చేసేవారి దుమ్ముదులిపిన విజయశాంతి!

'అర్జున్ s/o వైజయంతి' సినిమాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై నటి విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నచ్చిన సినిమాలపై మీకెందుకు అంత పైశాచిక ఆనందం.. సినిమాలను మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి అని మండిపడ్డారు.

New Update

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీ కొడుకులుగా రూపొందిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'అర్జున్ s/o వైజయంతి'.  ఏప్రిల్ 10న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే కొంతమంది మాత్రం సినిమా బాగోలేదంటూ రివ్యూలు పెడుతున్నారు. అవుడేటెడ్ స్టోరీ అని ట్రోల్ చేస్తున్నారు. 

ఈ క్రమంలో తాజాగా మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగా.. నటి విజయశాంతి సినిమా పై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగున్న  సినిమాను బాగాలేదని, బాలేని సినిమాను బాగుందని ప్రచారం చేయడమేంటి? అని మండిపడ్డారు. కొంతమంది కావాలనే సినిమాలను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. 

Also Read: Hero Ajith: మరోసారి అజిత్ కారుకు ప్రమాదం.. ట్రాక్ పక్కకు దూసుకెళ్లిన వాహనం

ఎందుకంత పైశాచిక ఆనందం 

సినిమా చిన్నదైనా, పెద్దదైనా చిత్ర నిర్మాతలు ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వస్తారు. నచ్చకపోతే సినిమా చూడకండి.. సైలెంట్ గా ఉండండి.. అంతేకాని సినిమాపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదు.  'అర్జున్ s/o వైజయంతి' సినిమా చూసి ప్రజలు అద్భుతంగా ఉందని అంటున్నారు. ప్రజలకు నచ్చిన సినిమాలపై మీకెందుకు అంత పైశాచిక ఆనందం.. సినిమాను చంపేస్తే కొన్ని జీవితాలు పోతాయి అంటూ ట్రోలర్ల పై మండిపడ్డారు విజయశాంతి. కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమాలను నాశనం చేసేవాళ్లను క్షమించకూడదని అన్నారు. 

ఇదిలా ఉంటే 'అర్జున్ s/o వైజయంతి' తొలి ప్రపంచవ్యాప్తంగా రూ. 5.15 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించారు. 

cinema-news | latest-news | Arjun Son of Vyjayanthi

Also Read:Jagamerigina Satyam: తెలంగాణ మట్టి వాసనను గుర్తుచేసేలా మరో సినిమా.. రవితేజ మేనల్లుడు హీరోగా!

Advertisment
తాజా కథనాలు