Vijay Sethupathi : అభిమాని పెళ్ళిలో సందడి చేసిన కోలీవుడ్ స్టార్ హీరో.. సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా!
విజయ్ సేతుపతి వీరాభిమానులైన జయబాస్, జయపాల్ జూన్ 2న పెళ్లిచేసుకోబోతున్నారు. వధూవరులను ఆశీర్వదించేందుకు సేతుపతి వారి ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఫోటోల్లో సేతుపతి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.