Jawan: చరిత్ర సృష్టించబోతున్న జవాన్ షారుఖ్ ఖాన్ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే హిందీ వెర్షన్ కు సంబంధించి కేజీఎఫ్-2 రికార్డ్ ను బద్దలుకొట్టిన ఈ సినిమా, ఇప్పుడు మరో మైలురాయికి చేరువైంది. By Karthik 20 Sep 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి షారుఖ్ ఖాన్ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే హిందీ వెర్షన్ కు సంబంధించి కేజీఎఫ్-2 రికార్డ్ ను బద్దలుకొట్టిన ఈ సినిమా, ఇప్పుడు మరో మైలురాయికి చేరువైంది. త్వరలోనే ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించింది. వారం రోజుల్లో సాలిడ్ హోల్డ్‌ను కొనసాగిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు 900 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ వీకెండ్ తో ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయం. ఇదే స్పీడ్ కొనసాగితే, ఈ వీకెండ్ నాటికి ఇది పఠాన్ లైఫ్ టైమ్ వసూళ్లు (రూ.1100 కోట్లు) మార్క్ ని కూడా క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. షారూక్ కెరీర్ లోనే టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది జవాన్ సినిమా. ఇప్పటివరకు షారూక్ నటించిన సినిమాలేవీ ఈ స్థాయిలో వసూళ్లు సాధించలేదు. సాధారణంగా కింగ్ ఖాన్ నటించిన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్సులతో పరిమితం అవుతాయి. అప్పుడెప్పుడో దశాబ్దాల కిందట చేసిన షారూక్ ప్రేమకథలు మాత్రమే రూరల్ వరకు వెళ్లాయి. మళ్లీ ఇన్నేళ్లకు జవాన్ రూపంలో, టాలీవుడ్ బి సెంటర్, సి-సెంటర్ ఆడియన్స్ కు చేరువయ్యాడు షారూక్. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే, మరో 6-7 కోట్లు ఈజీగా వచ్చేలా ఉన్నాయి. పఠాన్ తర్వాత ఆ సంవత్సరంలో షారుఖ్ ఖాన్ నటించిన రెండో చిత్రం జవాన్. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో దీపికా పదుకొణె, సంజయ్ దత్ అతిధి పాత్రల్లో మెరిశారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ బ్లాక్ బస్టర్ సంగీతాన్నందించాడు. #hindi-version #nayanthara #vijay-sethupathi #jawaan #shah-rukh-khan #kgf-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి