Vijay Sethupathi : అభిమాని పెళ్ళిలో సందడి చేసిన కోలీవుడ్ స్టార్ హీరో.. సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా! విజయ్ సేతుపతి వీరాభిమానులైన జయబాస్, జయపాల్ జూన్ 2న పెళ్లిచేసుకోబోతున్నారు. వధూవరులను ఆశీర్వదించేందుకు సేతుపతి వారి ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఫోటోల్లో సేతుపతి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. By Anil Kumar 31 May 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Vijay Sethupathi Attends His Fans Wedding : తమిళ సినీ ఇండస్ట్రీలో సింప్లిసిటీకి మారు పేరు విజయ్ సేతుపతి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస ఆఫర్స్ తో భారీ స్టార్ డం అందుకున్న ఈ హీరో నిజ జీవితంలో చాల సింపుల్ గా ఉంటాడు.పేరుకే స్టార్ సెలెబ్రిటీ గా ఉంటూ ఓ సామాన్య జీవితాన్ని గడుపుతుంటాడు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో విజయ్ సేతుపతి సింప్లిసిటీ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక తాజాగా మరోసారి ఈ హీరో తన సింప్లిసిటీతో ఆకట్టుకున్నాడు. అభిమాని పెళ్ళిలో సింఫుల్ గా... మదురై జిల్లా ఉసిలంబట్టి పరిధి కీజాపుదూర్‌కు చెందిన జయబాస్, జయపాల్ ఇద్దరూ విజయ్ సేతుపతికి వీరాభిమానులు. అందులో ఒకరు విజయ్ సేతుపతి జిల్లా అభిమాని సంఘానికి అధ్యక్షుడిగా కాగా.. మరొకరు జిల్లా ఉప కార్యదర్శిగా ఉన్నారు. ఈ ఇద్దరు తాము జూన్ 2న పెళ్లిచేసుకోబోతున్నారు. Also Read : మూడోసారి తండ్రి కాబోతున్న స్టార్ హీరో..! అయితే.. విజయ్ సేతుపతికి అదే రోజు షూటింగ్ ఉండటంతో ముందుగానే వధూవరులను ఆశీర్వదించేందుకు వారి ఇంటికి వెళ్లారు. దాంతో ఆ ప్రాంతం అంతా సందడి నెలకొంది. విజయ్ సేతుపతిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో విజయ్ సింపుల్ గా పట్టు వస్త్రాలు ధరించి, నుదుటిన విభూధి పెట్టుకొని కనిపించాడు. దీంతో ఈ ఫోటోలు చుసిన నెటిజన్స్ సేతుపతి సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా హీరో అంటే నిజంగా ఇలా ఉండాలని, విజయ్ సేతుపతిని చూసి మిగతా హీరోలు సైతం నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తూ విజయ్ సేతుపతి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. . #vijay-sethupathi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి