Conspiracy To Expel Muslims : ముస్లిం(Muslims) లను భారత్ దేశం(India) నుంచి వెళ్ళగొట్టాలని బీజేపీ(BJP) కుట్ర చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్(V. Hanumantha Rao). మరోసారి లోక్ సభ ఎన్నికల్లో గెలిచి భారత రాజ్యాంగాన్ని బీజేపీ మార్చాలని చూస్తోందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా మోదీ హటావో.. దేశ్ బచావో అని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుందని.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి తెలంగాణకు చేసింది ఏమి లేదని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బయటపడిందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు.
పూర్తిగా చదవండి..V. Hanumantha Rao : ముస్లింలను భారత్ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
TG: ముస్లింలను భారత్ దేశం నుంచి వెళ్ళగొట్టాలని బీజేపీ కుట్ర చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు వీహెచ్. రాజ్యాంగాన్ని బీజేపీ మార్చాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: