Cabinet Ministers: కొత్తగా కొలువుదీరిన కేంద్ర మంత్రుల్లో 99 శాతం మంది కోటీశ్వరులే
కేంద్ర మంత్రివర్గం సభ్యుల్లో 70 మంది (99 శాతం) కోటీశ్వరులేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) మంగళవారం ఓ నివేదికలో వెల్లడించింది. మంత్రుల సగటు ఆస్తి విలువ దాదాపు రూ.107.94 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.