గగన్ యాన్ తో స్పేస్ లోకి వెళ్లనున్న ‘వ్యోమ మిత్ర’... వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి...!
కరోనా మహమ్మారి వల్ల గగన్ యాన్ మిషన్ ఆలస్యమైందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి స్పేస్ ఫ్లైట్ ట్రయల్ ను అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో చేపట్టనున్నట్టు వెల్లడించారు.గగన్ యాన్ మిషన్లో భాగంగా మహిళా రోబో ‘వ్యోమ మిత్ర’ను అంతరిక్షానికి పంపనున్నట్టు పేర్కొన్నారు. ఆ రోబో మానవులు చేసే కార్యకలాపాలను నిర్వహిస్తుందన్నారు. ఆ రోబోతో మిషన్ అంతా సజావుగా అని పిస్తే మిషన్ ను ముందుకు తీసుకు వెళ్తామన్నారు.