10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై! TG: 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫీజు చెల్లించాలంటే పాఠశాలల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీయాల్సిన అవసరం లేదని.. ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చని పేర్కొంది. By V.J Reddy 13 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి 10th Exam Fees: తెలంగాణలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫీజు చెల్లించాలంటే ప్రధానోపాధ్యాయులు లేదా పాఠశాలల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీయాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చని పేర్కొంది. కాగా ఇంతక ముందు వరకు స్కూల్ యాజమాన్యాలు బ్యాంకులకు వెళ్లి చలానా కట్టే వారు.. దీంతో తీవ్ర ఇబ్బందిని అటు విద్యార్థులు.. ఇటు విద్యాసంస్థలు ఎదుర్కునేవి. తాజాగా దీనిపై రేవంత్ సర్కార్ చలానా విధానాన్ని రద్దు చేసింది. ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించేలా మార్పు చేసినట్లు తెలిపింది. డిసెంబర్ 21వ తేదీ వరకు.. ఇటీవల తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీలను ప్రభుత్వ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ ప్రకటించారు. ఫీజు చెల్లించేందుకు 18వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 50 రూపాయల లేట్ ఫీజుతో డిసెంబర్ 2వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అలాగే 200 రూపాయల లేట్ ఫీజుతో డిసెంబర్ 12వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఇచ్చారు. అంతే కాకుండా 500 రూపాయల ఆలస్య రుసుంతో డిసెంబర్ 21వ తేదీ వరకు చెల్లించవచ్చని విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటించారు. రెగ్యులర్ స్టూడెంట్స్ అన్ని పేపర్లకు కలిపి 125 రూపాయలు, మూడు కంటే తక్కువ పేపర్లు ఉంటే 110 రూపాయలు, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. #TG SSC Exam Fee #ts-ssc-exams #10th-exams మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి