Ashwini Vaishnaw : డ్రైవర్ క్రికెట్ చూస్తూ రైలు నడపడంతోనే ప్రమాదం: అశ్వినీ వైష్ణవ్
గతేడాది విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనపై కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు . లోక్పైలెట్, సహాయ లోకోపైలెట్లు తమ సెల్ఫోన్లో క్రికెట్ చూస్తూ రైలు నడపడంతోనే రెండు రైళ్లు ఢీకొన్నట్లు తెలిపారు. ఇప్పుడు రైల్వేలో కొత్త భద్రతా చర్యలు తీసుకొచ్చామన్నారు.