Insta Reel : రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపై కుటుంబం బలి!

సోషల్ మీడియా రీల్స్ పిచ్చితో రైలుపట్టాలపై స్టంట్ చేసిన ఓ కుటుంబం దుర్మరణం చెందింది. యూపీ లహర్‌పూర్‌కు చెందిన దంపతులు మహ్మద్ అహ్మద్, నజ్రీన్.. కొడుకు అబ్దుల్లాను లక్నో నుంచి మైలాన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. శరీరాలు ఛిద్రమయ్యాయి.

author-image
By srinivas
New Update
train

Train Accident: రీల్స్ పిచ్చి ఓ కుంటుంబాన్ని బలితీసుకుంది. సోషల్ మీడియాను అడ్డదారిలో వాడిన ఓ బాలుడు తాను దుర్మరణం చెందడంతోపాటు తల్లిదండ్రుల చావులకు ప్రత్యక్షంగా కారణమయ్యాడు. ఏకంగా రైలు వస్తున్నపుడు పట్టాలపై నిలబడి వీడియో తీసి నెట్టింట సంచలనం క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో అదే రైలు కిందపడి నలిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read : ఫార్మాసిటీ ఫార్మా ఉద్యోగి మిస్సింగ్

శుభకార్యానికి హాజరై..

యూపీలోని సీతాపూర్ జిల్లా లహర్‌పూర్‌కు చెందిన మహ్మద్ అహ్మద్ (26), నజ్రీన్ (24)లకు అబ్దుల్లా అనే మూడేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే బుధవారం లఖింపూర్ ఖిరి జిల్లా హర్‌గావ్ దగ్గరలోని క్యోతి అనే గ్రామంలో ఓ శుభకార్యానికి కుటుంబంతో హాజరయ్యారు. ఈ క్రమంలోనే సమీపంలోని రైలు పట్టాలపైకి వచ్చి ఫొటోలు దిగడం మొదలుపెట్టారు. అప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేయడం అలవాటున్న వారు.. రైల్వే ట్రాక్ పైకి వచ్చి రీల్స్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో రైలు వస్తున్న విషయాన్ని గమనించకపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. లక్నో నుంచి మైలాన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ముగ్గురిని ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శరీరాలు ఛిద్రమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరకుని విచారించారు. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు తీస్తుండగా ప్రమాదం జరిగినట్లు నిర్ధారించి, కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Also Read : మగపిల్లలను వేధిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. చచ్చుబడిపోతున్న శరీరాలు

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొంతమంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగా మరికొంతమంది నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ సానుభూతి చూపిస్తున్నారు. ఇకనైనా రీల్స్ పిచ్చి ఉన్నవారు బుద్ధి తెచ్చుకోవాలంటూ చురకలంటిస్తున్నారు.

గతంలోనూ యూటూబర్స్ లోయలోపడి చనిపోయిన సంఘటనను గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియా పిచ్చితో కుటుంబాలకు దూరం కావొద్దని, పిల్లలను వీలైనంతవరకూ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. పిల్లలే కాదు పెద్దలు సైతం మారాలని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  1. కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి మరో కీల‌క ప‌ద‌వి

                      2.  నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు: నటి హేమ

Advertisment
తాజా కథనాలు