Earthquake: చైనా, టిబెట్ భూకంపాలు...ఇప్పటివరకు 53 మంది మృతి
టిబెట్‌ను ఈరోజు ఉదయం భారీ భూకంపాలు కుదిపేశాయి. రిక్టర్ స్కేల్ మీద 7.1 తీవ్రతతో సంభవించిన ఈ ఆరు భూకంపాలలో ఇప్పటివరకు 53 మంది చనిపోయారు. దాంతో పాటూ భారత్, నేపాల్, భూటాన్‌లోని పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి.