నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు బ్రహ్మోత్సవాలు కావడంతో స్వామివారికి ఘనంగా చక్రస్నానం నిర్వహించి మాడ వీధుల్లో విహరించున్నారు. ఈ రోజు స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి రానున్నారు.
జంటగా శ్రీవారిని దర్శించుకున్న దువ్వాడ శీను ,దివ్వెల మాధురి|Duvvada Srinivas,Madhuri in Tirumala|RTV
తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు, ఇది ఇలాగే కొనసాగించాలని సూచించారు.
తిరుమలలో అపచారం.. టీటీడీ కీలక ప్రకటన!
AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని.. ఇది అపచారం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. దీనిని భక్తులు ఎవరు నమ్మొద్దని ఎక్స్‌లో టీటీడీ వివరణ ఇచ్చింది.
రేపు తిరుమలకు చంద్రబాబు.. ప్రభుత్వం తరుఫున పట్టువస్త్రాల సమర్పణ!
ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమలలో నూతనంగా నిర్మించిన వకుళామాత వంటశాలను సీఎం ప్రారంభించనున్నారు.