TGRTC: ప్రయాణికులను ఇబ్బంది పెడితే...బస్సులను సీజ్ చేస్తాం: మంత్రి
సంక్రాంతి పండగ సమయంలో ప్రయాణికులను ఇబ్బందిపెడితే సహించేది లేదని, బస్సులను సీజ్ చేస్తామని ప్రైవేట్ బస్సుల యజమానులనురాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
సంక్రాంతి పండగ సమయంలో ప్రయాణికులను ఇబ్బందిపెడితే సహించేది లేదని, బస్సులను సీజ్ చేస్తామని ప్రైవేట్ బస్సుల యజమానులనురాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఆర్టీసీ చరిత్రలోనే ఒక విప్లవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో నష్టాలపాలైన సంస్థను లాభాలబాట పట్టించామన్నారు. కొత్తలోగో ఆవిష్కరించి.. హైదరాబాద్ లో ఇకపై డీజిల్ బస్సులు, ఆటోలకు స్వస్తిపలికేలా చర్యలు తీసుకుంటామన్నారు.
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీ ఆర్టీసీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఎయిర్ పోర్టుకు వెళ్లే పుష్పక్ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ సంస్థలో తర్వలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. మొత్తం 3,305 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 2 వేల డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి.
హైదరాబాద్ వాసులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం నాడు మాట్లాడుతూ.. ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్-సికింద్రాబాద్ మార్గం (రూట్ నెంబర్ 24 ఈ) లో 8 కొత్త మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు.