Elon Musk : ఆ సమయానికి నేను బతికుండను.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
టెక్నాలజీ అభివృద్ధిలో వేగం పెంచకపోతే మనం అంగారకుడిపైకి వెళ్లే సమయానికి తను బతికి ఉండనని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే తీవ్రమైన అడ్డంకులు దాటి ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడ్డారు.