Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
తెలంగాణలో కొత్త బ్రాండ్ల అమ్మకాల అనుమతుల కోసం మద్యం కంపెనీలు ఎగబడుతున్నాయి. ఇప్పటివరకు 92 మద్యం సరఫరా కంపెనీలు 604 కొత్త బ్రాండ్లకు అనుమతి కోరుతూ దరఖాస్తులు పెట్టుకున్నాయి.
తెలంగాణలో కొత్త బ్రాండ్ల అమ్మకాల అనుమతుల కోసం మద్యం కంపెనీలు ఎగబడుతున్నాయి. ఇప్పటివరకు 92 మద్యం సరఫరా కంపెనీలు 604 కొత్త బ్రాండ్లకు అనుమతి కోరుతూ దరఖాస్తులు పెట్టుకున్నాయి.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల మేర పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే నిజామాబాద్‌లో 3.2 డిగ్రీలు పెరిగి 42.5 డిగ్రీలుగా నమోదయ్యింది.
తెలంగాణలో చపాతీలు తిన్న వెంటనే తల్లీ కొడుకు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. పుడ్ పాయిజన్ కారణమని కొందరు, మరికొందరు అత్తింటి వేధింపులు భరించలేక చనిపోయిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఎక్సైజ్ శాఖకు రూ. 34,600 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త దుకాణాల దరఖాస్తుల ద్వారా రూ. 264.50 కోట్లు సమకూరాయి. పన్నుల రూపంలో రూ. 7,000 కోట్లు వచ్చాయి.
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. HCU విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దీనిపై ప్రకటన చేశారు.
ఓ వివాహిత, యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి. చేవెళ్ల హౌసింగ్ బోర్డు కాలనీలో వివాహిత యమున(30) ఆత్మహత్యకు పాల్పడగా.. విజయవాడలో బల్లం శరణ్య(19)అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.
బీజేపీ సన్నబియ్యం ఇస్తే దేశం మొత్తం ఎందుకు ఇవ్వడం లేదని బండి సంజయ్‌కు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ వేశారు. బండి సంజయ్‌కు రోజురోజుకు అభద్రతా భావం పెరుగుతోందని అన్నారు. కాంగ్రెస్‌పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.