Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఎల్ అండ్ టీ సంచలన నిర్ణయం!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలో కొత్త మెట్రో రైళ్లకు ఎల్అండ్టీ సంస్థ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు తయారీ సంస్థ బీఈఎంఎల్తో ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రస్తుతం మూడు రూట్లలో 57 మెట్రోలు తిరుగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువైంది.