/rtv/media/media_files/2025/12/11/dfdrere-2025-12-11-21-09-04.jpg)
TG News: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో కీలక నేతలకు ఊహించని షాక్‌లు తగిలాయి. ఆయా గ్రామాల్లో గెలుపు తమదేననే ధీమాతో ఉన్న నాయకులకు సైతం చుక్కెదురైంది. భారీగా ఖర్చు చేసినా ఓటర్లు కనికరించకపోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కీలక నేతలు తమ ప్రభావం చూపలేక చతికిలపడిపోయారు. నమ్మకున్న ఓటర్లు కూడా నిండా ముంచడంతో పరువుపోయినట్లు భావిస్తున్నారు. పార్టీల ఇంచార్జ్‌లు, ఎమ్మెల్యేలు సైతం సర్పంచ్ ఎన్నికల్లో విఫలకావడంతో పార్టీ అధిష్టానానికి మోహం ఎలా మోహం చూపించాలని తర్జనభర్జన పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఒకసారి ఓటమి వివరాలను గమనిస్తే ఇలా ఉన్నాయి.
ఎమ్మెల్యే మురళీకి ఎదురు దెబ్బ..
మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్‌కు తన స్వగ్రామంలో ఎదురుదెబ్బ తగిలింది. సోమ్లాతండాలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఎమ్మెల్యే మురళి సొంత వదిన భూక్యా కౌసల్య ఓటమి చవిచూడటం చర్చనీయాంశమైంది. భూక్యా కౌసల్యపై ఇస్లావత్ సుజాత అనే మహిళ 27 ఓట్లతో విజయం సాధించడం సంచలనం రేపుతోంది.
అనిరుధ్‌రెడ్డి ఇలాకాలో బీఆర్ఎస్ హవా!
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి సొంతూరులో బిగ్ షాక్ తగిలింది. ఆయన నిలబెట్టిన అభ్యర్థిపై బీజేపీ క్యాండెట్ గెలుపొందారు. గ్రామంలో మొత్తం 972 ఓట్లు పోలు కాగా కాంగ్రెస్ అభ్యర్థి అంజలికి 459, బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతికి 490 ఓట్లు పడ్డాయి. మొదట బీజేపీ అభ్యర్థి రేవతి 6 ఓట్ల మెజారిటీ సాధించగా.. కాంగ్రెస్ పార్టీ నాయకులు రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. దీంతో ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ చేయగా రేవతికి 31 ఓట్ల మెజారిటీ రావడంతో గెలుపు ఖాయమైంది. దీంతో అనిరుద్ రెడ్డి సొంత మండలం రాజాపూర్‌లో మెజారిటీ స్థానాలను బీఆర్ఎఎస్ గెలుచుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
పటేల్ రమేష్ రెడ్డికి చుక్కెదురు..
తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సొంత ఊర్లో చుక్కెదురైంది. సూర్యాపేట రూరల్ బాలెంలలో BRS పార్టీ అభ్యర్థి 260 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో రమేష్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కాకుండా పటేల్ రమేష్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే జగదీష్ రెడ్డి గెలిచే వాడు కాదన్నారు. ఇప్పుడేమైంది..సొంత ఊర్లోనే ప్రభావం చూపలేకపోయాడు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈటల రాజేందర్‌కు బిగ్‌షాక్
తెలంగాణ తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బోణీ కొట్టింది. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ ఎంపీ ఈటల రాజేందర్‌కు ఓటర్లు మరోసారి బిగ్‌షాక్ ఇచ్చారు. కమలాపూర్ మండలంలో ఈటల బలపర్చిన బీజేపీ రెబల్ అభ్యర్థి తెలిపిన ర్యాకం సంపత్ ఓటమిపాలయ్యారు. బండి సంజయ్ వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్ధి ర్యాకం శ్రీనివాస్ 90 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ర్యాకం శ్రీనివాస్ కమలాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక ఉప్పలపల్లిలో బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 4 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. భీమదేవరపల్లి మండలం రసూల్ పురాలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి మహేశ్ గెలుపొందారు.
Follow Us