Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న సూర్యుడు.. రానున్న రెండ్రోజులు జాగ్రత్త
తెలంగాణలో రానున్న రెండు రోజులు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలో రానున్న రెండు రోజులు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 12న తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు అధికారులుఎల్లో అలర్ట్ జారీ చేశారు.రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల మేర పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే నిజామాబాద్లో 3.2 డిగ్రీలు పెరిగి 42.5 డిగ్రీలుగా నమోదయ్యింది.
తెలంగాణలో మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 7, 8 తేదీల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది.సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. నేటి నుంచి నాలుగు రోజులు పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. నేడు వనపర్తి, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు.
తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వానలు అక్కడక్కడ పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది.
తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోయింది. సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. కుమురంభీం జిల్లా సిర్పూర్, గిన్నెదారిలో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.