Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మూడు రోజులు భారీ వర్షాలు
తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బెంగాల్‌తో పాటు -ఒడిశా తీరానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.