Telangana : బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
బాసర ఆర్జేయూకేటీలో తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బాసర ఆర్జేయూకేటీలో తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పెట్టుబడుల పేరుతో రూ.26 కోట్ల మోసానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను తాజాగా హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ నిందితులు మోసాలకు పాల్పడ్డారని డీసీపీ కవిత తెలిపారు.
హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో మెజార్టీ శాతం ఉన్న మాదిగలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఓట్ల కోసం వస్తే.. కాంగ్రెస్ నాయకులను తరిమి కొడతామంటూ హెచ్చరించారు.
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని.. కోర్టు ఏప్రిల్ 23కు పొడిగించిన అనంతరం.. ఆమె కోర్టుకు రాసిన లేఖ బయటపడింది. ఈ కేసులో నాకు ఎలాంటి సంబంంధం లేదని.. ఎవరి నుంచి నేను ఆర్థికంగా ప్రయోజనం పొందలేదని లేఖలో కవిత పేర్కొన్నారు.
తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్.. బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వేసవిలో జన సమీకరణ కష్టమని భావించి.. బహిరంగ సభలకు బదులుగా బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో మంగళవారం కన్నుముశారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. ఉదయం ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
హైదరాబాద్‌లో నీటి సమస్యలు మొదలయ్యాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. రోజుకు 6500 ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. దీంతో వాటికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు రహీల్‌ను పోలీసులు అరెస్టు చేశాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతడిని ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొన్న కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.