Telangana : డీఎస్సీ దరఖాస్తుకు నో ఫీజ్.. తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త!
డీఎస్సీ దరఖాస్తుకు ఫీజు వసూలు చేయకూడదని రాష్ట్ర సర్కార్ భావిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. లోక్సభ ఎన్నికల తర్వాత జాబ్ క్యాలెండర్ ఉంటుందని వెల్లడించారు.