TET : టెట్ పరీక్షలు రీషెడ్యూల్.. కొత్త తేదీలివే!
తెలంగాణలో టెట్ పరీక్షల కొత్త తేదీల షెడ్యూల్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. టెట్ పరీక్షలను అధికారులు రీ షెడ్యూల్ చేశారు.
తెలంగాణలో టెట్ పరీక్షల కొత్త తేదీల షెడ్యూల్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. టెట్ పరీక్షలను అధికారులు రీ షెడ్యూల్ చేశారు.
హైదరాబాద్ మెట్రోరైలు మరో ఘనత సాధించింది. తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటిందని.. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రో వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అయ్యిందని, నిత్యం 5.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారన్నారు.
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేటలోని 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. కీసర, ఘట్కేసర్లో 45.1 డిగ్రీలు, చిల్కూరు, మోయినాబాద్లో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అయోధ్య రామాలయం ఫొటోతో బండి సంజయ్ ప్రచారం చేయడంపై.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తు్న్నారంటూ శశిథరూర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే.. అవి ఫిబ్రవరిలో పంచిన ఫొటోలంటూ బండి సంజయ్ బదులిచ్చారు.
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న సనావుల్లా(24) అనే వ్యక్తిని ఇద్దరు దుండగులు మొబైల్ అడిగారు. అతడు ఇవ్వకపోవడంతో కత్తితో పొడిచి పరారయ్యారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. నదిలో మునిగిపోతున్న తండ్రిని కాపాడబోయి కూతురు మృతి చెందింది. తండ్రి గోదావరిలో స్నానానికి దిగి మునిగిపోతుండగా.. ఒడ్డున ఉన్న కూతురు చేయి అందించి బయటకి లాగింది. ఈ క్రమంలోనే కాలుజారి నీటిలో మునిగి మృతి చెందింది.
విజయవాడలో ఒకే కుటుబంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. డా. డీ. శ్రీనివాస్ ఇంటి బయట ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. ఇంటి లోపల అతని భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉరేసుకుని బలవన్మరణానానికి పాల్పడ్డారు.
పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. రీకౌంటింగ్‌కు కూడా 15 రోజుల వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఒక సబ్జెక్టుకు రూ.500 వరకు చెల్లించాలని పేర్కొన్నారు.