Leopard: చిరుత సంచారంతో బెంబెలెత్తుతున్న గంగారం గ్రామ వాసులు !
మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారంలో చిరుత సంచారం గ్రామవాసులను కలవర పెడుతోంది. కొన్ని నెలల క్రితం ఇదే గ్రామంలో మేకలు,ఆవులపై చిరుత దాడి చేసి చంపిన ఘటనలు జరిగాయి. ఇప్పుడు గ్రామశివార్లలో చిరుత సంచరిస్తుందని ప్రజలకు తెలియటంతో వారు బెంబెలెత్తి పోతున్నారు.