రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు బాధ్యత కరువైందని రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ ఒక్కరోజే రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు జరగడం బాధాకరం. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. మహిళలకు భద్రత కరువైందని, పెరిగిన అత్యాచారాల గురించి అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కూడా కాలేదు. చట్టాలు చేసే అసెంబ్లీలో మనం ఉండి ఎందుకనే స్వీయ ప్రశ్న వేసుకోవాల్సిన తరుణం. మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరం.
పూర్తిగా చదవండి..Harish Rao: రాష్ట్రంలో ఒక్కరోజే నాలుగు అత్యాచారాలా ? హరీష్ రావు ఫైర్
రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కరోజే రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు జరగడం బాధాకరమని.. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: