2011 నుంచి ప్రిపేర్ అవుతున్నా | Telangana Group-1 Aspirants Emotional | Group-1 Exam Issue | RTV
ఆ పని చేస్తున్నావని వీడియో తీస్తాం.. నగల వ్యాపారికి బ్లాక్ మెయిల్!
కొంతమంది యూట్యూబర్లు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కాప్రాలోని నగల వ్యాపారి గుడివాడ రమణ్‌లాల్ అన్నారు. రత్నాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నావంటూ ఆరోపణలు చేస్తూ తనపై వీడియోలు రూపొందిస్తామని బెదిరించినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో కొత్త టీచర్లలో 47శాతం మహిళలే!
TG: రాష్ట్రంలో డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల్లో మహిళలు 47 శాతం మంది ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ టీచర్లలో 50 శాతానికిపైగా మహిళలున్నారు. మరోవైపు 2017 డీఎస్సీలో సైతం 55-60 శాతం మంది వరకు మహిళలే ఎంపికయ్యారు.
TGPSC Group 1: తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్
తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 27వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తొలిసారి ప్రశ్నపత్రాల వాహనాలకు జీపీఎస్ ట్రాకర్లను పెట్టారు.
తెలంగాణలో కులగణన సర్వే .. మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం
తెలంగాణలో త్వరలో కులగణన సర్వే జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఉపాధి ఏంటి ఇలా మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం చేశారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
TGPSC Group 1: సుప్రీం కోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు
TG: గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 అభ్యర్థుల తరఫున సుప్రీంకోర్టులో అడ్వకేట్ మోహిత్ రావు పిటిషన్ వేశారు. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్ష వాయిదాపై వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది.
BIG BREAKING: గ్రూప్-1 పరీక్షలపై బిగ్ ట్విస్ట్!
TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై మరోసారి చుక్కెదురైంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని వేసిన పిటిషన్‌ను సింగల్ బెంచ్ కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు అభ్యర్థులు. కాగా అప్పీల్ పిటిషన్ ను హైకోర్టు పాస్ ఓవర్ చేసింది.