Telangana : త్వరలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు..?
తెలంగాణ లో కొద్ది రోజుల క్రితమే పార్లమెంట్ ఎన్నికల సమయం ముగిసింది.జులై మొదటి వారంలో షెడ్యూల్, చివరి వారంలో పంచాయతీ ఎన్నికల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం.
తెలంగాణ లో కొద్ది రోజుల క్రితమే పార్లమెంట్ ఎన్నికల సమయం ముగిసింది.జులై మొదటి వారంలో షెడ్యూల్, చివరి వారంలో పంచాయతీ ఎన్నికల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ కారు గుర్తును పోలిన సింబల్స్ ఆ పార్టీని వెంటాడుతున్నాయి. రోడ్ రోలర్, రోటీ మేకర్ గుర్తులు కారు లాగే ఉండడంతో బీఆర్ఎస్ ఓట్లు చీలే అవకాశం ఉంది. గతంలో కూడా చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయావకాశాలను రోడ్ రోలర్, రోటి మేకర్లు దెబ్బ తీశాయి.
తెలంగాణలోని ప్రైవేటు స్కూళ్ళల్లో పీజుల నియంత్రణకు ప్రభుత్వం నడుం కట్టింది. రుసుముల నియంత్రణకు కొత్త చట్టం తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మూడు లేదా నాలుగు నెలల్లో వస్తుందని చెబుతున్నారు విద్యాశాఖా ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం.
బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మీద విరుచుకుపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీద ఆరోపణలు చేశారు. అలాగే ఆయనేమైనా ప్రధానమంత్రా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీదన కూడా మండిపడ్డారు.
ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఆమెను వరుస ప్రమాదాలు వెంటాడాయని...రెండు సార్లు తప్పించుకున్న లాస్య మూడోసారి మాత్రం తప్పించుకోలేకపోయిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు.
దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న నిరసనను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకోవాలన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భారత రైతాంగానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు, దిగుమతులు ఉండాలన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మధ్య ఇంట్రస్టింగ్ టాపిక్ నడిచింది. మంత్రి పదవి ఎప్నుడొస్తుంది అంటూ కేటీఆర్ అడిగితే వద్దు..ప్లీజ్ నన్ను కాంట్రవర్శీ చేయొద్దు అంటూ రాజగోపాల్ రెడ్డి వెళ్ళి పోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
తెలంగాణ రైతుల మీద వరాల జల్లులు కురిపించడానికి రెడీ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం.వచ్చే వానాకాలం సీజన్ నుంచి క్వింటా వరికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు...పంటల బీమా పథకం మీదనా కసరత్తులు చేస్తున్నామని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ ను అరెస్ట్ చెయ్యొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 17 న పోలీసుల ముందు హాజరు కావాలని చెప్పింది. తదుపరి విచారణ ఈ నెల 24 కు కోర్టు వాయిదా వేసింది .పంజాగుట్ట కార్ ప్రమాదం కేసులో సోహెల్ క్వాష్ పిటిషన్ వేసాడు.