Telangana: కేటీఆర్, రాజగోపాలరెడ్డి ల మధ్య ఆసక్తికర సంభాషణ

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మధ్య ఇంట్రస్టింగ్ టాపిక్ నడిచింది. మంత్రి పదవి ఎప్నుడొస్తుంది అంటూ కేటీఆర్ అడిగితే వద్దు..ప్లీజ్ నన్ను కాంట్రవర్శీ చేయొద్దు అంటూ రాజగోపాల్ రెడ్డి వెళ్ళి పోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

New Update
Telangana: కేటీఆర్, రాజగోపాలరెడ్డి ల మధ్య ఆసక్తికర సంభాషణ

KTR, Rajagopal reddy Discussion:అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. తెలంగాణ అసెంబ్లీ సమావేవాలకు హాజరయిన ఇరు నేతలూ అక్కడే ఒకరికొకరు ఎదురు పడకడారు. దీంతో రాజగోపాల్ రెడ్డితో మాటలు కలిపారు కేటీఆర్. మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అడిగారు. దీనికి మీ లాగే మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందన్న రాజగోపాల్ సమాధానం ఇచ్చారు. దానికి వెంటనే ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కౌంటర్ వేశారు. దాంతో పాటూ ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా.. సంకీర్త్ పోటీ చేస్తున్నారా.. అని కూడా అడిగారు. దీంతో వద్దు బ్రో...దయచేసి నన్ను కాంట్రవర్సీ చేయొద్దని అక్కడి నుంచి రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయారు. ఈ మొత్తం వ్యవహారం అంతా అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించింది.

Also Read:Chennai:అమ్మో బాంబు..చెన్నైలో పాఠశాలలకు బెదిరింపులు

కోమటి రెడ్డి కుటుంబంలో పదవుల కుపంటి...
మరోవైపు నిజంగానే కోమటి రెడ్డి ఇంటిలో పదవుల కోసం వార్ జరుగుతోంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి హోంమంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈయన అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. దాంతో పాటూ భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లు కూడా అడుగుతున్నారు. అయితే ఎంపీ సీట్లు కోమటి రెడ్ఇ వెంటకరెడ్డి కుటంబానికి పోతే తనకు వచ్చే మంత్రి పదవి పోతుందని రాజగోపాల్ రెడ్డి భయపడుతున్నారు. దీంతో ముందుగానే అలర్ట్ అయిన రాజగోపాల్‌రెడ్డి..మా కుటుంబానికి ఇంకా ఏ పదవులు వద్దంటున్నారు.
భువనగిరి, నల్గొండ పార్లమెంట్‌కు మా కుటుంబ సభ్యులెవ్వరూ..పోటీ చేయకూడదు అనేది తన ఉద్దేశమని చెబుతున్నారు. దీంతో అన్నదమ్ములిద్దరి మధ్యా కోల్డ్ వార్ జరగుతోంది. తమ్ముడి కోసం అన్న వెంకట్‌రెడ్డి తగ్గుతాడా? కుటుంబసభ్యులను పక్కనపెట్టి తమ్ముడికి మంత్రి పదవి ఇప్పిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్‌ను గద్దె దించేందుకే...

మరోవైపు అసెంబ్లీ సమావేశాల తరువాత కె. రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. తాను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలు కంట్రోల్ ఉంటారని ఆయన అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకే తాను కాంగ్రెస్ లోకి వచ్చానని చెప్పారు. తాను హోం మంత్రి అయితే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు జైలుకు వెళ్ళడం ఖాయమని అన్నారు. భువనగిరి, నల్గొండ లోక్‌సభ స్థానాల్లో మా కుటుంబసభ్యులెవరూ పోటీ చేయకూడదనేది మా ఆలోచన. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం. ఎవరికి టికెట్‌ ఇచ్చినా గెలిపిస్తాం’’ అని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు