Tummala: రైతుల నిరసనను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి: తుమ్మల నాగేశ్వరరావు దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న నిరసనను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకోవాలన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భారత రైతాంగానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు, దిగుమతులు ఉండాలన్నారు. By Jyoshna Sappogula 20 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Tummala Nageswara Rao: ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆలయ అధికారులు, స్థానిక నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు తుమ్మల నాగేశ్వరరావు. మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. Also Read: జగన్‌ను తిట్టమన్నారు… ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు! ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా రైతులు చేస్తున్న నిరసనను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకోవాలని సూచించారు. అందరికీ అన్నం పెట్టే రైతును కేంద్రం ఆదుకోవాలని ఏపీ-తెలంగాణ రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రైతాంగం ఢిల్లీ పొలిమేరలో చేస్తున్న నిరసన ఉద్యమం ప్రశాంతంగా జరగాలని కోరుకున్నారు. Also Read: రేపల్లెలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి భారీ చేరికలు! రైతుల నిరసనలో అసాంఘిక శక్తులు చొరబడకుండా రైతులు సమయమనం పాటించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఖర్చులకు ఒకటిన్నర రెట్లు గిట్టుబాట ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ రిపోర్టు అమలు పరచాలని డిమాండ్ చేశారు. భారత రైతాంగానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు, దిగుమతులు ఉండాలన్నారు. #tummala-nageswara-rao #telanagana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి