Andhra Pradesh: వారం,పదిరోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో వస్తాం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
రాజమండ్రిలోని జేఏసీ సమావేశం అనంతరం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం, పది రోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. టీడీపీ-జనసేన ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై, ఉమ్మడి ప్రణాళికపై లోతుగా చర్చించామని.. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా దాదాపు 3గంటలసేపు చర్చించామని పేర్కొన్నారు. వైసీపీ అరచకానికి జనసేన-టీడీపీ ప్రభుత్వమే విరుగుడు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వం కూడా మాతో కలిసి రావడానికి సానుకూలంగా ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేక ఓటు చీలనీవ్వమని స్పష్టం చేశారు.