/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/A-spirited-meeting-at-Bhimineni-Residency-in-Punganur-Constituency-jpg.webp)
పుంగనూరు నియోజకవర్గంలోని భీమినేని రెసిడెన్స్ లో టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, నియోజకవర్గ ఇంచార్జి చల్లబాబు పాల్గొని సీఎం జగన్ పరిపాలన తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించే సత్తా చల్లా బాబుకు ఉందన్నారు. జనసేన, టీడీపీ కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడే నాయకులు, కార్యకర్తలు కలిసి ఒక మిషన్ గన్‌లా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి:వలలో చిక్కుకున్న నాగుపాము.. ఎలా కాపాడారంటే..!!
తమపై తప్పుడు కేసులు బనాయించి టీడీపీ కార్యకర్తలను జైల్లో పెట్టించినా భయపడేదిలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో బ్రిటిష్ పరిపాలన అంతమొందిన పుంగనూరులో మాత్రం బానిసత్వం కొనసాగుతున్నదని ఆయన ఎద్దేవా చేశారు. రానున్న 2024 ఎన్నికల్లో రామచంద్రారెడ్డి గెలవడని చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరులో దొంగ ఓట్లకు నిలయంగా మారిందని.. తిరుపతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పుంగనూరు నుంచి అత్యధికంగా దొంగ ఓటర్లని తరలించారని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కలయిక ఓ సరికొత్త అధ్యాయము సృష్టిస్తోందన్నారు. చంద్రబాబుకు 14 సంవత్సరాల అనుభవం, ప్రజలకు న్యాయం చేకూర్చాలన్న పవన్ నైజం రెండు కలిసి రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్య్రం రానున్నదని ఆయన తెలిపారు.
టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు మాట్లాడుతూ.. టీడీపీ బలపడుతుదన్న భయంతో లేనిపోని తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలు, నాయకులపై వందల కేసులు పెట్టి జైల్‌కు తరలించారని అన్నారు. ఎన్ని వేల కేసులు పెట్టిన భయపడే ప్రసక్తే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలకు పుంగనూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్, పెద్దిరెడ్డిలపై మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీలో ఆరు నెలలుగా కొనసాగిన పార్టీ కార్యక్రమాలు చూసి ఓర్వలేక కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. జైల్లో అన్నం లేక, ఇంటివద్ద వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీడీపీ శ్రేణులు బెదిరే ప్రసక్తి లేదన్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక జనసేన తొడవడంతో పతనం కాయమన్నారు.