Telugu Desam Party: వైయస్ జగన్(CM Jagan) ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులకు టీడీపీ నిరసన కార్యక్రమం నిర్వహించనుంది. ఈ నెల 27వ తేదిన ఉమ్మడి కృష్ణా జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళిత శంఖారావం అనే కార్యక్రమం విజయవాడలో జరుగుతుందని తెలిపారు ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ. దళితుల పంతం..వైసీపీ అంతం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.
Also read: గుక్కెడు మంచినీరు కోసం రోడ్డెక్కిన గ్రామస్ధులు..!
తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి శావల దేవదత్ ఆధ్వర్యంలో దళిత శంఖారావానికి వేలాదిగా తరలిరావాలని కోరారు సంజయ్ వర్మ. ఈ క్రమంలోనే సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. దళితులకు మేనమామ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి దళితులకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశాడు. దళితులకు చేసేందేమి లేదని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలోనే దళితులపై దాడులు ఎక్కువ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: తమిళ స్టార్ హీరో సూర్యకు ప్రమాదం..ఆందోళనలో ఫ్యాన్స్.!
కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి జయరాజు మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో దళితులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి చరమగీతం పాడతారని అన్నారు. టీడీపీ గెలుపు తథ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి శావల.దేవదత్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద మురళీమోహన్ బొద్దు కోళ్ళ. ప్రేమ రాజ్, ప్రభాకర్, రవికుమార్ బి.బెనర్జీ, కొత్తపల్లి. ఆనంద్ స్వరూప్, తదితరులు పాల్గొన్నారు.