TDP: ఊడ్చుకుపోయిన బొత్స కుటుంబం!
విజయనగరం జిల్లాను పది సంవత్సరాల పాటు పరిపాలించిన బొత్స కుటుంబానికి విజయనగరం జిల్లా ఓటర్లు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బొత్స కుటుంబం నుంచి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు.
విజయనగరం జిల్లాను పది సంవత్సరాల పాటు పరిపాలించిన బొత్స కుటుంబానికి విజయనగరం జిల్లా ఓటర్లు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బొత్స కుటుంబం నుంచి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు.
ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ ముందుకు సాగుదామని పేర్కొన్నారు.
ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతగా ఉన్న చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.
ఏపీలో టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి అద్భుత విజయాలు నమోదు చేయడం పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు, టీడీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడంతో శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీయే కూటమికి గట్టి పోటీ ఇచ్చింది. దాదాపు నెక్ టూ నెక్‌గా లీడింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది ఇండియా. ఎన్డీయే మిత్ర పక్షాలకు గాలాలను విసురుతోంది.
సరికొత్త రాజకీయ మలుపుగా ఈ గెలుపు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ గెలుపు జనం గెలుపు. జనసేనాని గెలుపు.కూటమి విజయానికి పాటుపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి జనసైనికుడికి, వీరమహిళకి నా ధన్యవాదాలు, శుభాబినందనలు.’’ తెలుపుతున్నట్లు నాగబాబు ట్విటర్లో రాసుకొచ్చారు.
తాజాగా 2024 ఎన్నికల ఫలితాల్లో ఏపీ లో మరోసారి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అయిపోయింది.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అన్న క్యాంటీన్లను కూడా తిరిగి ప్రారంభించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీ అభివృద్ది కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతులు కలపడంతో వారి నాయకత్వంలో రాష్ట్రానికి రానున్న రోజుల్లో మంచి రోజులు రానున్నాయని అంబటి రాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.