AP: కూటమి నేతల కీలక సమావేశం
ఏపీలో గెలుపు దిశగా కూటమి అడుగులు వేస్తోంది. ఎన్టీఆర్ భవన్ లో కూటమి నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణస్వీకారంపై కీలక ప్రకటన చేయనున్నారు.
ఏపీలో గెలుపు దిశగా కూటమి అడుగులు వేస్తోంది. ఎన్టీఆర్ భవన్ లో కూటమి నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణస్వీకారంపై కీలక ప్రకటన చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి చేరువలో ఉంది. ఇప్పటికే చాలా ఆధిక్యంలో దూసుకువెళుతున్న కూటమి...ఈసారి అక్కడ గవర్నమెంటు ఏర్పాటు చేయడం ఖాయం అని తెలుస్తోంది. ఏపీలో కూటమి విజయానికి కారణాలు ఏంటి? వైసీపీ ఎందుకు గెలవలేకపోయింది కింది ఆర్టికల్లో చూడండి.
AP: ఎన్నికల కౌంటింగ్ వేళ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెగ్మెంట్ టీడీపీ ఏజెంట్ రమేష్ గుండెపోటుకు గురయ్యారు. నర్సరావుపేట జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే ఆయనను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని టీడీపీ నేతలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక సంస్థలు టీడీపీ కూటమిదే విజయం అని చెప్పడంతో, ఆ పార్టీ మరో ఆలోచన చేయడం లేదు.
ఏపీ ప్రజలు ఐదేళ్ల పాటు పడ్డ కష్టాలకు రేపటితో అడ్డుకట్ట పడబోతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దని సూచించారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు టెలీకాన్ఫరెన్స్ ద్వారా చెప్పారు.
గ్జిట్ పోల్స్ సర్వేలో వైసీపీ అత్యధిక సీట్లు గెలుస్తుందని ఆరా మస్తాన్ చేసిన సర్వే అంత ఫేక్ అని దానిని ఎవరూ నమ్మోద్దని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ఆరా మస్తాన్ కి బుద్దా ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
AP: బ్యాలెట్ ఓటు విషయంలో సీఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం సాయంత్రం 6 గంటలకు తీర్పును వెల్లడించనుంది. కాగా హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
అమలాపురానికి చెందిన ప్రముఖ పంచాంగకర్త ఉపదృష్ట నాగాదిత్య కూటమికి 135 సీట్లు వస్తాయంటున్నారు. 106 సీట్లతో జగన్ సీఎం అవుతారని సిద్ధాంతకర్త పల్లవార్దుల శ్రీరామకృష్ణ శర్మ అంటున్నారు. మరో ప్రముఖ జ్యోతిష్యులు తెన్నెంటి విక్రం బాబు ఒక్క సీటుతో అయినా వైసీపీదే విజయం అంటున్నారు.
వైసీపీ నేతల పిచ్చి పరాకాష్టకు చేరిందని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కుల రాజకీయాలకు పెట్టింది పేరు వైసీపీ పార్టీ అని, రాష్ట్రంలో కూటమిదే విజయం అన్నారు.