Kalyan Ram: మామయ్య, బావ, అత్తకు కల్యాణ్‌రామ్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించడంపై నటుడు కల్యాణ్ రాము స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్, బాలకృష్ణ, పురందేశ్వరీలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించడంపై నటుడు కల్యాణ్ రాము స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్, బాలకృష్ణ, పురందేశ్వరీలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఎన్డీయే కూటమి పక్షాల భేటీలో ఆయన పాల్గొననున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుతోపాటు కేబినెట్లో ఎక్కువ మంత్రి పదవులు డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి సమావేశంలో పాల్గొననున్నారు. కాగా చంద్రబాబు కాన్వాయ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మే 13న ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఏపీ ఎన్నికల కౌంటింగ్ పై ఫైనల్‌గా ఫలితం వచ్చేసింది. ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలిచాయో పూర్తి లెక్క వచ్చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఏపీలో ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారని.. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని మని పేర్కొన్నారు.
విజయనగరం జిల్లాను పది సంవత్సరాల పాటు పరిపాలించిన బొత్స కుటుంబానికి విజయనగరం జిల్లా ఓటర్లు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బొత్స కుటుంబం నుంచి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు.
ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ ముందుకు సాగుదామని పేర్కొన్నారు.
ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతగా ఉన్న చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.