Tirupathi: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్
వైసీపీనేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తిరుపతి పోలీసులు. బెంగుళూరులో మోహిత్ ను అరెస్ట్ చేశారు. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 37వ నిందితుడుగా మోహిత్ పేరు ఉంది.
వైసీపీనేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తిరుపతి పోలీసులు. బెంగుళూరులో మోహిత్ ను అరెస్ట్ చేశారు. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 37వ నిందితుడుగా మోహిత్ పేరు ఉంది.
జనసేన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కాయి.జనసేన పార్టీ కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అధికారిక విప్‌లుగా ప్రకటించాలని లేఖలో కోరారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆమె కుప్పానికి వెళ్లారు. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనైనా కొట్లాడతానంటూ భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరంపై ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులను కలిసి వివరిస్తామని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలనను ఈ నెల 24న ఢిల్లీలో ఫొటో గ్యాలరీ ద్వారా దేశానికి వివరిస్తామన్నారు. ఈ మేరకు జగన్ తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బిఎసి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని శ్వేత పత్రాలు ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో అరాచక, ఆటవిక పాలన నడుస్తోందంటూ రాష్ట్ర గవర్నర్ కు మాజీ సీఎం జగన్ ఫిర్యాదు చేశారు. ప్రజలపై జరిగిన దాడులపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎర్ర మట్టిదిబ్బలు విషయంలో ప్రభుత్వాలు మారినా పరిస్థితులు ఏమీ మారలేదని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. అప్పుడు జగన్ పార్టీని తిట్టారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మాజీ సీఎం జగన్‌తో సహా 11 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు వస్తారని మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వమిదని.. అసెంబ్లీలో మా వ్యూహాలు మాకున్నాయని అన్నారు.
AP: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. తాను వైసీపీలోనే కొనసాగుతానని అన్నారు. కొన్ని ఛానెల్స్ తనపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.