Kota: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 11వ ఘటన
రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ-జేఈఈకి సిద్ధమవుతున్న బీహార్‌కు చెందిన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాదిలో ఇది 11వ మరణం కావడం దుమారం రేపుతోంది.
రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ-జేఈఈకి సిద్ధమవుతున్న బీహార్‌కు చెందిన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాదిలో ఇది 11వ మరణం కావడం దుమారం రేపుతోంది.
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాయచోటి ఎస్పీ కార్యాలయం వద్ద ఓ ఏఆర్ మహిళా కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలిని వేదవతిగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
మధ్య ప్రదేశ్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8 మందిని హత్య చేశాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చింద్వారా జిల్లాలోని బోదల్ కచ్చార్ గ్రామంలో చోటు చేసుకుంది.
భద్రాచలంలో ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొణిజర్ల మండలం సిద్ధిక్‌నగర్‌కు చెందిన పగిడిపల్లి కారుణ్య (17) అనే విద్యార్థిని కాలేజీ భవనం పై నుంచి కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీగార్డు ప్రకాశ్ కాప్డే దారుణానికి పాల్పడ్డాడు. సెలవుపై సొంతూరు జామ్నెర్ వెళ్లిన కాప్డే.. అర్ధరాత్రి తన ఇంట్లోనే సర్వీస్ తుపాకీతో మెడపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హెచ్‌సీయూ స్టూడెంట్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు క్లోజ్ చేసినా ఇప్పటికీ అనేక ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి. ఈ కేసు విచారణ మళ్లీ జరపాలంటూ రేవంత్ సర్కార్ కోర్టు మెట్లెక్కడంతో మరోసారి రోహిత్ కులం హాట్ టాపిక్ గా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం జరిగింది. చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లవన్ కుమార్ గుప్త(22) ఉద్యోగం రాక తీవ్ర మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మలక్‌పేట పీఎస్ పరిధిలోని వరంగల్‌కు చెందిన యాకయ్య(19) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న యాకయ్య శుక్రవారం సాయంత్రం తన గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.