TG Crime: హైదరాబాద్‌లో విషాదం.. నారాయణ కాలేజీలో మరో విద్యార్థి మృతి
హైదరాబాద్‌లోని అన్నోజిగూడలో ఉన్న నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి బానోత్ తనూష్ నాయక్(16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు లెక్చరర్ వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లై మూడు నెలలే అయింది.. కానీ ఆ సమస్యలతో వివాహిత బలవన్మరణం!
మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. 22 ఏళ్ల రోషిణి మూడో అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లై మూడు నెలలే అయింది. కానీ ఆమెను అనారోగ్య సమస్యలు వెంటాడటంతో తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో ఏం చేయాలో అర్తం కాకా బలవన్మరణానికి పాల్పడింది.
Mulugu: ఎన్కౌంటర్ జరిగిన రాత్రే..వాజేడు ఎస్సై ఆత్మహత్య!
ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ రిసార్ట్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగిన రాత్రే ఎస్సై సూసైడ్ చేసుకోవటం డిపార్ట్మెంట్లో కలకలం రేపుతోంది.
కదులుతున్న ఆర్టీసీ బస్సులోఉ*రేసుకు | Young Man Sui*cide In Tirupati TRC Bus | RTV
విశాఖలో దారుణం.. వేధింపులు భరించలేక టీచర్ ఆత్మహత్య
యువకుడు ప్రేమ వేధింపులు భరించలేక టీచర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని భీమిలిలో చోటుచేసుకుంది. ఓ స్కూల్లో విద్యా వాలంటీర్‌గా చేస్తున్న ఆమెను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించమని బలవంతం పెట్టడంతో ఈ దారుణం జరిగింది.
Social Media: సోషల్ మీడియాలో వేధింపులు.. యాదాద్రిలో యువతి దారుణం!
భువనగిరిలో యువకుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ చదువుతున్న హాసినికి కొన్ని రోజులుగా నిఖిల్ అనే వ్యక్తి ఇన్ స్టాలో అసభ్యకర మెసేజ్ లు పంపుతూ వేధింపులకు గురిచేశాడని. ఇది తట్టుకోలేక హాసిని ఉరేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రలు ఆరోపిస్తున్నారు.
పెన్ను వివాదం.. హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థిని సూసైడ్!
ఏపీ పల్నాడు జిల్లాలో విషాద ఘటన జరిగింది. బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలో భావన కాలేజీలో ఇంటర్ ఫస్ట్ఇయర్ చదువుతోంది. విద్యార్థులతో పెన్ను విషయంలో గొడవ జరిగింది. మనస్థాపం చెంది కాలేజీ హాస్టల్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది.
బర్త్‌డే రోజే.. ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్థిని ఆత్మహత్య!
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతోంది. స్నిగ్ధ పుట్టిన రోజున ఆమెకు విషెస్ చెప్పాలని స్నేహితులు వెళ్లారు. అప్పటికే స్నిగ్ధ తన గదిలో ఉరేసుకుని కనిపించింది. వెంటనే వారు ఆమె పేరెంట్స్‌కి సమాచారం అందించారు.