Hyderabad:మరీ ఇంత క్రూరమా? కోట్లకు కోట్లు కట్నం తీని కూడా హింస పెట్టి చంపేశారు!
నాలుగు కోట్లు కట్నం తీసుకున్నారు. బంగారం, ఇల్లు అన్నీ ఇచ్చారు..కానీ వాళ్ళకి ఇంకా ఆశ చావలేదు. మూడేళ్ళుగా అమ్మాయిని అదనపు కట్నం కోసం వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
నాలుగు కోట్లు కట్నం తీసుకున్నారు. బంగారం, ఇల్లు అన్నీ ఇచ్చారు..కానీ వాళ్ళకి ఇంకా ఆశ చావలేదు. మూడేళ్ళుగా అమ్మాయిని అదనపు కట్నం కోసం వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
వరంగల్‌లో కనకదుర్గ చిట్ ఫండ్స్‌లో ఏఎమ్‌జీ గా పని చేస్తున్న భాస్కర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. తాను మంచి చేద్దామని చూస్తే చివరకు తనకు చావే మిగిలిందని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయారు. పై అధికారులే తన చావుకు కారణమని, వాళ్ళని శిక్షించాలని కోరారు.
ఐదు వందలకోసం గొడవపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడివాడలో చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన భర్త రాంబాబు భార్య కనకదుర్గను డబ్బులు కావాలని అడగడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాంబాబు ఉరేసుకుని చనిపోగా ఆమె కూడా ఉరేసుకుని తనువు చాలించింది.
సూశాంత్ సింగ్ సూసైడ్ కేసులో జైలుకు వెళ్లిన రియా చక్రవర్తి అక్కడి అనుభవాలను షేర్ చేసుకుంది. 'జైలులో రోటీ, క్యాప్సికం కూర పెట్టేవాళ్లు. పేరుకే అది కూర గానీ నీళ్లలా ఉండేది. అయినా బాగా ఆకలిగా ఉండటంతో తినేసేదాణ్ని. నేను పడుకునే పక్కనే టాయిలెట్ ఉండేది' అంటూ చెప్పుకొచ్చింది.
సంగారెడ్డి జిల్లా రంజోల్ లోని గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న 16ఏళ్ల విద్యార్థిని ఆదివారం మిట్ట మధ్యాహ్నం హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటూ పేరెంట్స్ ఆందోళన చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సీమంతం కోసం పుట్టింటికి వెళ్లిన భార్యకు వీడియోకాల్ చేసి భర్త ఉరేసుకుని చనిపోయిన ఘటన ఉప్పల్ లో చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరుకు చెందిన నరేష్ మెట్రోలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య నిత్య సీమంతం విషయంలో గొడవ జరగడంతో మనస్థాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడు.
పెళ్ళై నాలుగు రోజులు అయింది. సరదాగా సినిమాకు వెళ్ళారు దారిలో ఏమైందో ఏమో తెలియదు కానీ భార్యాభర్తలు ఇద్దరూ గోదావరిలోకి దూకారు. ఇందులో భార్య గల్లంతవ్వగా...భర్త మాత్రం బతికి బయటపడ్డాడు. భర్తే కావాలని భార్యను చంపాడన్న ఆరోపణలతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.