UPPAL : ఉప్పల్ లో దారుణం.. భార్యను వీడియోకాల్ లైవ్ లో ఉంచి భర్త ఏం చేశాడంటే.. సీమంతం కోసం పుట్టింటికి వెళ్లిన భార్యకు వీడియోకాల్ చేసి భర్త ఉరేసుకుని చనిపోయిన ఘటన ఉప్పల్ లో చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరుకు చెందిన నరేష్ మెట్రోలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య నిత్య సీమంతం విషయంలో గొడవ జరగడంతో మనస్థాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడు. By srinivas 30 Dec 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి UPPAL : హైదరాబాద్ ఉప్పల్ లో దారుణం చోటుచేసుకుంది. పుట్టింటికి వెళ్లిన భార్యాకు వీడియోకాల్ చేసి లైవ్ లో ఓ యువకుడు సూసైడ్ (Sucide) చేసుకున్న సంఘటన కలకలం రేపింది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రపంచలోకి అడుగుపెట్టబోతున్న పసిగుడ్డును, కట్టుకున్న ఇల్లాలిని ఒంటరి చేసి భర్త ఆత్మహత్య చేసుకోవడం స్థానికులు, కుటుంబ సభ్యులను కలచివేసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలావున్నాయి. యాదాద్రి జిల్లా (Yadadri) పెద్ద కందుకూరుకు చెందిన ముత్తడి నరేష్(28) (Naresh) ఉప్పల్‌లోని సరస్వతి కాలనీలో భార్య నిత్యశ్రీ (Nithya sri) తో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాది క్రితమే వివాహమైంది. నరేష్ మెట్రో (metro) రైలు సిగ్నలింగ్ విభాగంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. యాదాద్రి జిల్లా అమ్మనబోలు గ్రామానికి చెందిన నిత్య.. ఇటీవల గర్భం దాల్చడంతో వారం క్రితం సీమంతం కోసం పుట్టింటికి వెళ్లింది. అయితే ఈ పండుగ నేపథ్యంలో సీమంతానికి బంధువులను పిలిచే విషయంలో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీంతో అదికాస్త గొడవలకు దారితీసింది. ఇదే క్రమంలో ఆస్తి తగాదాలు తలెత్తాయి. ఇరువురి కుటుంబ సభ్యులు సైతం గొడవలు పెట్టుకున్నారు. ఇది కూడా చదవండి : Shri Chaitanya: శ్రీ చైతన్య స్కూల్ నిర్వాకం.. విద్యార్థి కాలు విరగొట్టిన ఉపాధ్యాయుడు ఈ క్రమంలో ఎవరినీ బాధపెట్టలేక మనస్థాపానికి గురైన నరేష్ శుక్రవారం భార్యకు వీడియో కాల్ చేసి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు. దీంతో వెంటనే చుట్టు పక్కల వారికి సమాచారం అందిచినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని, నరేష్ మరణించినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. #nitya-sri #naresh #sucide #uppal సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి