Hyderabad: లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దారుణం.. 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థులు లైంగిక దాడి! హైదరాబాద్ ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు 9వ తరగతి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. నిందితుల్లో ఒకడికి యాజమాన్యం టీసీ ఇచ్చి పంపించింది. విద్యార్థి సంఘాలు బాధిత కుటుంబానికి మద్దతుగా ధర్నాకు దిగాయి. By srinivas 02 Aug 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి LITTILE FLOWER SCHOOL: హైదరాబాద్ ఉప్పల్లో దారుణం జరిగింది. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న బాలికపై తొమ్మిదో తరగతి విద్యార్థులు లైంగిక దాడికి యత్నించిన ఘటన సంచలనం రేపుతోంది. క్లాస్ రూంలోనే ఈ దాడి జరగగా.. ఆ చిన్నారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో తీవ్ర ఆగ్రహంతో స్కూలుకు వెళ్లి ఘటనపై యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ క్రమంలో వెంటనే చర్యలు మొదలు పెట్టిన యాజమాన్యం ముగ్గురు విద్యార్థుల్లో ఒకరికి టీసీ ఇచ్చి పంపించగా.. మరో ఇద్దరు విద్యార్థులపై చర్యలు తీసుకోకపోవడం విశేషం. కాగా దీనిపై స్పందించిన విద్యార్థి సంఘాలు బాధిత కుటుంబానికి మద్దతుగా ధర్నాకు దిగాయి. దీంతో స్కూల్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత కుంటుంబానికి న్యాయం చేస్తామని పోలీస్ అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. #students-sexually-assaulted #little-flower-school #hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి