Southwest monsoon : నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి
అనేక ఏండ్ల తర్వాత తొలిసారి రోహిణికార్తెలోనే వానాకాలం వచ్చేసింది.ఎండకాలం పూర్తిగా పోకముందే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణను పలకరించాయి. అనుకున్న సమయం కంటే 13 రోజుల ముందే నైరుతిరుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి.
AP : ఏపీలోకి రుతుపవనాలు... ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు!
ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించేందుకు రెడీగా ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి
నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళతో పాటు ఈశాన్య భారత రాష్ట్రాల్లోకి రుతుపవనాల ప్రవేశించినట్లు పేర్కొంది. వారం, పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపింది.
Rains: ఈరోజు కేరళను తాకనున్న నైరుతి!.. రేపు పలు జిల్లాల్లో వర్షాలు
నైరుతి రుతుపవనాలు ఈరోజు కేరళను తాకుతాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అలాగే రేపు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Rain Alert : మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!
నైరుతీ రుతుపవనాలు.. కేరళ తీరాన్ని మే 31వ తేదీ వరకు చేరే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. నాలుగు రోజులు ముందుగానీ, లేక ఆలస్యంగా కానీ నైరుతీ రుతుపవనాలు కేరళలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.